దారుణం.. అత్యంత దారుణం.. బావను కిరాతకంగా గొడ్డలితో నరికి చంపాడు బామ్మర్ధి.. ఈ ఘటన హైదరాబాద్ సిటీ శివార్లలోని చేవెళ్ల మండలం ఊరెళ్ల గ్రామ శివార్లలోని ఓ ఫాంహౌస్ లో జరిగింది. 2024, ఏప్రిల్ 16వ తేదీ రాత్రి జరిగిన ఈ ఘటన.. బావను చంపిన బామ్మర్ధి.. పోలీస్ స్టేషన్ కు వచ్చి స్వయంగా చెప్పటంతో వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
చేవెళ్ల గ్రామానికి చెందిన అంబేద్కరిస్ట్ కడమంచి నారాయణ దాస్(46) అనే వ్యక్తికి వరుసకు బామ్మర్ది అయినా తుప్పటి భాస్కర్ తో కొద్దిరోజులుగా గొడవలు జరుగుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఈక్రమంలోనే నారాయణ దాస్ ను గొడ్డలితో నరికి హత్య చేసినట్లు తెలుస్తోంది. హత్య అనంతరం చేవెళ్ల పోలీస్ స్టేషన్ కు వెళ్లి భాస్కర్ లొంగిపోయాడు. దీంతో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే, ఈ హత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సివుందని సీఐ లక్ష్మారెడ్డి తెలిపారు.