హైదరాబాద్ లో పెట్రోల్ బంకులో మహిళను కొట్టాడు : ఆ తర్వాత రెండు వర్గాల రచ్చ రచ్చ

హైదరాబాద్ లో పెట్రోల్ బంకులో మహిళను కొట్టాడు : ఆ తర్వాత రెండు వర్గాల రచ్చ రచ్చ

హైదరాబాద్ సిటీ అబిడ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు వర్గాల పోటాపోటీ ఆందోళన ఉద్రిక్తంగా మారింది. ఓ పెట్రోల్ బంకులో ఆయిల్ కొట్టించుకోవటానికి బండిపై వచ్చింది ఓ మహిళ. క్యూలో నిలబడింది. ఇదే సమయంలో ముందు బండి వ్యక్తిని.. ముందుకు వెళ్లాలని చెప్పంది. ఈ సమయంలో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. కోపంతో ఊగిపోయిన ఆ వ్యక్తి.. ఆ మహిళను పెట్రోల్ బంకులోనే కొట్టాడు. కడుపులో గుద్దాడు. ఈ ఘటనతో మిగతా వాహనదారులు, బంకు సిబ్బంది షాక్ అయ్యారు.

అతన్ని ఆపేప్రయత్నం చేశారు.. అడ్డుకున్నారు. ఆ బండి వ్యక్తి మరింత రెచ్చిపోవటంతో.. బంకు సిబ్బందితోపాటు.. మిగతా వాహనదారులు ఆ వ్యక్తిని పెట్రోల్ బంకులోనే కొట్టారు. ఈ విషయం తెలిసిన మహిళ తరపు వారు.. ఆ బండి వ్యక్తికి సంబంధించిన వారు.. ఇద్దరూ పెట్రోల్ బంకు దగ్గరకు చేరుకున్నారు. కొంత మంది వాహదానరులు విషయాన్ని పోలీసులకు సమాచారం ఇవ్వటంతో.. ఈ విషయం పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది.

Also Read :- ఉదయాన్నే భారీగా ట్రాఫిక్​ జాం

పోలీస్ స్టేషన్ దగ్గర కూడా రెండు వర్గాలు ఆందోళనకు దిగారు. మహిళను కొట్టిన వ్యక్తి మద్యం మత్తులో ఉన్నట్లు చెబుతున్నారు పోలీసులు. అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ గొడవపై అబిడ్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయ్యింది. దాడి చేసి కొట్టిన వ్యక్తికే పోలీసులు మద్దతు ఇస్తున్నారంటూ కొట్టించుకున్న మహిళ తరపు బంధువులు ఆరోపిస్తున్నారు.