
- సిద్దిపేటలో యువతి ఇంటికి వచ్చిన యువకుడు
- కత్తితో మెడపై దాడి చేసిన యువతి బంధువులు
- తీవ్ర గాయాలు.. గాంధీ హాస్పిటల్‌కు తరలింపు
- యువతి ఇంటికి వచ్చిన యువకుడిపై కత్తితో దాడి
- తీవ్ర గాయాలతో దవాఖానకు...
సిద్దిపేట రూరల్, వెలుగు : సోషల్ మీడియాలో ఓ యువతితో పరిచయం యువకుడి ప్రాణం మీదకు తెచ్చింది. సిద్దిపేట వన్ టౌన్ సీఐ కృష్ణారెడ్డి కథనం ప్రకారం..జనగామ జిల్లా ఆలేరులోని పోచమ్మ గుడి ఏరియాకు చెందిన గుండు సాయికిరణ్ కు సిద్దిపేట పట్టణం హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన ఓ యువతితో స్నాప్ చాట్ లో పరిచయం ఏర్పడింది. కొద్ది రోజులుగా ఇద్దరూ చాటింగ్ చేసుకుని తర్వాత ఫోన్లో మాట్లాడుకుంటున్నారు.
ఈ క్రమంలో ఇద్దరూ కలుసుకోవాలనుకున్నారు. మంగళవారం సిద్దిపేటలోని ఆమె ఇంటికి వచ్చిన సాయి కిరణ్‌పై బంధువులు కత్తితో మెడపై దాడి చేశారు. ఊహించని ఘటనతో బిత్తరపోయిన అతడు రోడ్డుపైకి పరుగులు తీసి పడిపోయాడు.
Also Raed : కొమురవెళ్లి మల్లన్న ఆలయంలో గ్రూపుల గొడవ
గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. 108 అంబులెన్స్‌లో అతడిని సిద్దిపేట ప్రభుత్వ హాస్పిటల్‌కు అక్కడి నుంచి హైదరాబాద్గాంధీ హాస్పిటల్ కు తరలించారు. యువకుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్త చేస్తున్నామని సీఐ తెలిపారు.