కరోనా వైరస్ ను అరికట్టేందుకు అన్నీ రాష్ట్రాల ఆరోగ్య శాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇంటింటికి తిరుగుతూ కరోనా వైరస్ పై అవగాహన కల్పిస్తున్నారు. అనుమానం ఉన్న వ్యక్తుల్ని పరీక్షించి ల్యాబ్ కు పంపిస్తున్నారు. వైరస్ సోకిందని నిర్ధారించిన తరువాత వారిని ఆస్పత్రులకు తరలిస్తున్నారు. అయితే ఈ ప్రాసెస్ లో ఆరోగ్య శాఖ కు చెందిన ఉద్యోగులు, డాక్టర్లు తమ ప్రాణాల్ని పణంగా పెట్టి విధులు నిర్వహిస్తున్నారు.
మధ్యప్రదేశ్ వినోబా నగర్ ప్రాంతంలో శనివారం ఆరోగ్య అధికారుల బృందం సర్వే నిర్వహించింది. ఈ సర్వే సందర్భంగా వ్యక్తి డాక్టర్లు, ఆశా వర్కర్లు, పారా మెడికల్ సిబ్బందిపై దాడి చేశాడు. సెల్ ఫోన్లను బలవంతంగా లాక్కొని పగలగొట్టాడు. దీంతో కంగుతిన్న స్థానికులు నిందితుణ్ణి అడ్డుకునే ప్రయత్నం చేశాడు. ఈ ప్రయత్నంలో నిందితుడు తన వెంట తెచ్చుకున్న కత్తితో వారిపై దాడికి పాల్పడ్డాడు.
అయితే ఈ దాడిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. దాడికి పాల్పడ్డ నిందితుణ్ని అదుపులోకి తీసుకున్నట్లు సర్వే ఇన్‌ఛార్జి, డాక్టర్ ప్రవీణ్ చౌరే తెలిపారు.