కానిస్టేబుళ్లపై కత్తితో దాడి చేసిన యువకుడు

ఉత్తరప్రదేశ్ గోరఖ్ పూర్ లో ఐఐటీ ఓల్డ్ స్టూడెంట్ దాడికి దిగాడు. గోరఖ్ నాథ్ ఆలయం వద్ద ఉన్న ఇద్దరు ప్రావిన్షియన్ ఆర్మ్ డ్ కానిస్టేబుళ్లపై కత్తితో దాడికి పాల్పడ్డాడు అహ్మద్ ముర్టాజా అబ్బాసీ. నిందితుడి దాడిలో ఇద్దరు కానిస్టేబుళ్లకు గాయాలయ్యాయి. పోలీసులు, స్థానికులు తమను తాము రక్షించుకునేందుకు నిందితుడిపై రాళ్లతో దాడి చేశారు. తర్వాత వెంబడించి పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై యూపీ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ దర్యాప్తు చేపట్టింది. ఐఐటీ ముంబయి నుంచి 2015లో కెమికల్ ఇంజినీర్ డిగ్రీ పొందిన అహ్మద్ ముర్టాజా... కొన్ని రోజుల క్రితం స్వస్థలమైన గోరఖ్ పూర్ వచ్చాడు. ముంబయి నుంచి అబ్బాసీ గోరఖ్ నాథ్ టెంపులు దగ్గరికి ఎందుకు వచ్చాడో తెలుసుకుంటున్నట్లు గోరఖ్ పూర్ ఏడీజీ అఖిల్ కుమార్ తెలిపారు.దర్యాప్తు కోసం పోలీసు బృందాలను నియమించినట్లు తెలిపారు. అయితే 2017 నుంచే తమ కుమారుడి మానసిక పరిస్థితి సరిగా లేదని తెలిపారు అబ్బాసీ తండ్రి మహ్మద్ మునీర్. అహ్మదాబాద్ లోని పలు హాస్పిటళ్లల్లో ట్రీట్మెంట్ చేయించినట్లు తెలిపారు.

పాడైన వ్యర్థాలతో అద్భుతాలు సృష్టిస్తున్న యువ ఇంజినీర్