దుండిగల్‌లో దారుణం.. కత్తితో మహిళపై వ్యక్తి దాడి

దుండిగల్‌లో దారుణం.. కత్తితో మహిళపై వ్యక్తి దాడి

కుత్బుల్లాపూర్: దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధి గండిమైసమ్మలోని ఓ మహిళపై వ్యక్తి కత్తితో దాడి చేసి..  ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. నిషా బాటి(38) అనే మహిళకు జీవన్ ఖాన్(35) అనే వ్యక్తితో గత కొంత కాలంగా పరిచయం ఉంది.  చింతల్‌లో ఉండే నిషా బాటికు ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో బుధవారం గండిమైసమ్మ వద్ద ఆమెతో గొడవపడ్డాడు. ఇద్దరి మధ్య  గొడవ పెరగడంతో కోపోద్రిక్తుడైన జీవన్ ఖాన్ ఆమెపై కత్తితో దాడి చేశాడు. 

అనంతరం అతను ఆత్మహత్యాయత్నం చేసుకునే ప్రయత్నం చేశాడు. సదరు మహిళ పరిస్థితి విషమించడంతో స్థానికంగా ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న దుండిగల్ పోలీసులు ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. ప్రాథమిక సమాచారం మేరకు.. మహిళ వంటమనిషిగా, దాడి చేసిన వ్యక్తి డ్రైవర్ గా పని చేస్తున్నట్లు తెలుస్తోంది.