జమ్మికుంట, వెలుగు: చేసిన అప్పులు తీర్చలేక, దళిత బంధు రెండో విడత డబ్బులు రాలేదని ఓ యువకుడు ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. గత నెల 28న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కరీంనగర్జిల్లాలోని జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలో ఉండే బొటికల శ్రీనివాస్ దళితబంధు మొదటి విడత డబ్బులతో డీజే సౌండ్స్ సిస్టమ్ కొనుక్కుని ఉపాధి పొందుతున్నాడు. దీంతో పాటు అప్పు చేసి డీజేకు సంబంధించిన మరికొన్ని వస్తువులు కొని బిజినెస్ చేస్తున్నాడు.
అప్పులకు వడ్డీలు పెరగడంతో పాటు వస్తది అనుకున్న దళిత బంధు రెండో విడత డబ్బులు రాకపోవడంతో మనోవేదనకు గురయ్యాడు. గత నెల 28న ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేయగా బంధువులు దవాఖానకు తీసుకువెళ్లారు. మృతుడి కుటుంబసభ్యుల నుంచి ఎలాంటి ఫిర్యాదు రాకపోవడంతో కేసు నమోదు కాలేదు.