దుబ్బాక, వెలుగు : ఇందిరమ్మ ఇండ్ల లిస్ట్‌లో పేరు లేదని ఓ యువకుడు సెల్టవర్ఎక్కి హల్‌చల్‌చేశాడు. ఈ సంఘటన దుబ్బాక మునిసిపాలిటీలోని లచ్చపేట వార్డులో జరిగింది. గురువారం ప్రకటించిన ఇందిరమ్మ ఇండ్ల జాబితాలో తన పేరు రాలేదని మనస్థాపానికి గురైన లచ్చపేటకు చెందిన మామిళ్ల రాజు శుక్రవారం సెల్టవర్ఎక్కాడు.
మంత్రి కొండా సురేఖ హామీ ఇచ్చేంత వరకు దిగనని అక్కడే కూర్చున్నాడు. విషయం తెలుసుకున్న ఎస్ఐ గంగరాజు, మున్సిపల్కమిషనర్రమేశ్కుమార్హామీ ఇవ్వడంతో కిందకు దిగాడు.