గోల్డన్ టెంపుల్ లో యువకుడి హల్ చల్.. కొట్టి చంపిన భక్తులు

గోల్డన్ టెంపుల్ లో యువకుడి హల్ చల్.. కొట్టి చంపిన భక్తులు

పంజాబ్ అమృత్ సర్ స్వర్ణ దేవాలయంలో కలకలం రేపింది. గర్భగుడిలో చొరబడిన ో యువకుడ్ని అక్కడున్న భక్తులు పట్టుకొని చావబాదారు. ఆ దెబ్బలకు యువకుడి అక్కడికక్కడే చనిపోయాడు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. వివరాల్లోకి వెళ్తే.. అందరూ పూజలు చేస్తున్న సమయంలో ఓ యువకుడు ఆలయం లోపల పెన్సింగ్ దూకి గర్భగుడిలో ప్రవేశించాడు. గర్భగుడిలోకి చొరబడడం, పవిత్రమైన గురుగ్రంథ్ సాహిబ్ పుస్తకంతో పాటు... అక్కడున్న కత్తిని ఎత్తికెళ్లేందుకు ప్రయత్నించాడు. దీంతో ఆ సమయంలో గుడిలో ఉన్నవాళ్లంతా ఒక్కసారిగా షాక్ తిన్నారు. 

ఆగ్రహానికి గురైన భక్తులు అతడిపై దాడికి పాల్పడ్డారు. తీవ్రంగా కొట్టడంతో అక్కడికక్కడనే మృతి చెందాడు. దీంతో పవిత్ర ఆలయమైన గోల్డెన్ టెంపుల్ లో భద్రతపై భక్తులు ప్రశ్నిస్తున్నారు. శనివారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. తలకు పసుపు వస్త్రం చుట్టుకుని ఓ వ్యక్తి స్వర్ణ దేవాలయంలోకి  ప్రవేశించాడని స్థానికులు.. పోలీసులు చెబుతున్నారు.  ఆలయంలోపున ఉన్న బంగారు గ్రిల్స్ పై నుంచి దూకి నిషిద్ధ గర్భగుడిలోకి వెళ్లిపోయాడు. అక్కడున్న కత్తిని పట్టుకుని వీరంగం సృష్టించాడు. 

దీంతో ఆ సమయంలో గురు గ్రంథ్ పఠిస్తున్న పూజారి వైపుగా వెళ్లి…అతడిని భయబ్రాంతులకు గురి చేశాడు. హఠాత్ పరిణామంతో అక్కడున్న భక్తులు భయబ్రాంతులకు గురయ్యారు. వెంటనే శిరోమణి గురుద్వార ప్రబంధక్ కమిటీ (NGPC) టాస్క్ ఫోర్స్ సభ్యులు అతడిని పట్టుకున్నారు. అతడిపై దాడికి పాల్పడ్డారు. తీవ్రంగా కొట్టడంతో మరణించారు. యువకుడి గురించి వివరాలు ఆరా తీస్తున్నామని, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వాడిగా గుర్తించామని పోలీసులు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీ ఆధ్వర్యంలో విచారణ చేపట్టాలని పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్ డిమాండ్ చేశారు