కీసర, వెలుగు: మేడ్చల్ జిల్లా కీసర పరిధిలో ఓ యువకుడిని దుండగులు హత్య చేసి, రోడ్డు పక్కన పడేసి వెళ్లారు. హరిదాసుపల్లి నుంచి దమ్మాయిగూడ వైపు వెళ్లే రోడ్డులో ఓ వ్యక్తి రక్తపు మడుగులో పడి ఉన్నాడని స్థానికులు బుధవారం మధ్యాహ్నం పోలీసులకు సమాచారం అందజేశారు. దీంతో పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు.
మృతుడిని కాప్రా పరిధిలోని ఎల్లారెడ్డి గూడెం చెందిన మహిపాల్ (25)గా గుర్తించారు. డెడ్‌బాడీపై కత్తిపోట్లు ఉన్నట్లు పేర్కొన్నారు. హత్యకు గల కారణాలు తెలియరాలేదని, కుటుంబసభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వెంకటయ్య తెలిపారు.