![మోదీ విదేశీ పర్యటనకు ఉగ్ర బెదిరింపులు.. పోలీసుల అదుపులో నిందితుడు](https://static.v6velugu.com/uploads/2025/02/man-calls-mumbai-police-claims-terrorists-may-attack-pm-modi-aircraft_0oDNw4XKFp.jpg)
న్యూఢిల్లీ: ప్రధాని మోదీని లక్ష్యంగా చేసుకుని బెదిరింపు కాల్ వచ్చిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మోదీ విదేశీ పర్యటన నేపథ్యంలో ఆయన ప్రయాణిస్తున్న విమానాన్ని టార్గెట్ చేసుకుంటామని ఓ ఆగంతకుడు బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈ మేరకు బుధవారం ముంబై పోలీసులు ఓ ప్రకటనను విడుదల చేశారు.
“ఈ నెల 11న ముంబై పోలీస్ కంట్రోల్ రూమ్కు ఓ ఫోన్ కాల్ వచ్చింది. విదేశీ పర్యటనలో ఉన్న మోదీ విమానంపై దాడి జరగొచ్చని అవతలి వ్యక్తి బెదిరించారు. సమాచార తీవ్రత దృష్ట్యా మేం వెంటనే ఇతర దర్యాప్తు సంస్థలను అప్రమత్తం చేశాం. కాల్ చేసిన వ్యక్తి ఎవరనే దానిపై దర్యాప్తు చేపట్టాం. ఫోన్ కాల్ చేసిన వ్యక్తిని గుర్తించి అదుపులోకి తీసుకున్నాం. అతడి మానసిక స్థితి సరిగ్గా లేదని తెలుస్తోంది. దీనిపై మరింత లోతుగా దర్యాప్తును కొనసాగిస్తున్నాం” అని ముంబై పోలీసులు పేర్కొన్నారు.