బాహుబలి సినిమాలో ప్రభాస్ ..భారీ లింగాన్ని ఎత్తుకుని పారే నీటిలో, భారీ గుంతల్లో నడుస్తాడు. అయితే ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన ఈ బాహుబలి ప్రాణమున్న భారీ మొసలిని ఎత్తుకుని పొలాల గట్ల మీద ధర్జాగా నడుస్తున్నాడు. ఇంతకు ఈ వ్యక్తి..మొసలిని భుజాలపై ఎందుకు ఎత్తుకున్నాడు. దాన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నాడో చూద్దాం..
ఉత్తర్ ప్రదేశ్ లో ఓ వ్యక్తి భారీ మొసలిని భుజాలపై వేసుకుని నడుచుకుంటూ వెళ్తున్నాడు. లలిత్ పూర్ లో వ్యక్తి మొసలి నోటిని తాళ్లతో కట్టి తీసుకెళ్తున్నాడు. అయితే మొసలి స్థానికంగా ఓ డ్రెయిన్ లో కనిపించింది. దీంతో యువకుడితో సహా మరికొందరు దాన్ని బంధించారు. అనంతరం ఆ మొసలిని నదిలో వదిలేయాలని భావించారు. అయితే ఎవరు కూడా మొసలిని భుజాన ఎత్తుకునేందుకు ధైర్యం చేయలేదు. దీంతో ఈ వ్యక్తి ముందుకొచ్చి మొసలిని భుజాన మోసుకెళ్లాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అయింది.
ललितपुर-युवक ने नाले से एक मगरमच्छ को पकड़कर और अपने कंधे पर लेकर जंगल में छोड़ने के लिए उसे निकल गया..वीडियो तेजी से वायरल हो रहा है..@ForestPolice pic.twitter.com/VJ31SAEiB7
— Vinit Tyagi (@tyagivinit7) October 21, 2023
మొసలిని భుజాన మోసిన ఈ వ్యక్తిపై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. అతను నిజమైన బాహుబలి అని పొడిగేస్తున్నారు. అతని సాహసానికి, ధైర్యానికి సెల్యూట్ చేస్తున్నారు.
కొందరైతే ఈ చర్యను ఖండిస్తున్నారు. మొసలిని అలా పట్టుకోవడం, భుజాన మోసుకెళ్లడం డేంజర్ అంటున్నారు. మొసలి కనిపిస్తే అటవీ శాఖ అధికారులకు లేదా పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచిస్తున్నారు.