కన్నీళ్లు వస్తున్నాయి : చెల్లెలి శవాన్ని భుజాన మోస్తూ.. ఇంటికి తీసుకెళ్లిన అన్న

దేశంలో అత్యంత విషాదకరమైన ఘటన యూపీలో జరిగింది. చెల్లెలు అనారోగ్యంతో చనిపోతే.. ఇంటికి తీసుకెళ్లటానికి మార్గం లేక.. అంబులెన్స్ రాలేని పరిస్థితుల్లో.. కిలోమీటర్ల దూరం.. రైలు పట్టాల వెంట నడుస్తూ.. సోదరి శవాన్ని భుజాన మోస్తూ.. ఇంటికి తీసుకెళ్లాడు అన్న.. ఇంత దయనీయమైన ఘటనకు కారణం ఏంటో చూద్దాం..

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఖేరీ జిల్లాలోని లఖింపూర్ గ్రామం. శివాని అనే యువతి కొన్నాళ్లుగా జ్వరంతో బాధపడుతుంది. పరీక్షలు చేయగా టైఫాయిడ్ అని చెప్పారు. లిఖింపూర్ గ్రామ సమీపంలోని ఓ ఆస్పత్రిలో చికిత్స చేయిస్తున్నారు. పరిస్థితి విషమించటంతో.. సిటీలోని పెద్ద ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు డాక్టర్లు. భారీ వర్షాలు, వరదల కారణంగా సిటీకి  వెళ్లే రహదారులు అన్నీ కొట్టుకుపోయాయి.. వరద నీరు చేరింది. అంబులెన్స్ వచ్చే పరిస్థితి లేదు. దీంతో శివాని అన్నయ్య.. తన చెల్లెలును కాపాడుకునేందుకు రైలు పట్టాల వెంట.. కొంత దూరం వెళ్లి.. అక్కడి నుంచి సిటీకి వెళ్లాలని చెల్లెలను భుజాన ఎత్తుకుని బయలుదేరాడు. అలా కొంత దూరం రైలు పట్టాల వెంట వెళ్లిన తర్వాత చెల్లెలు శివాని కన్నుమూసింది. 

ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో అక్కడే కూలబడ్డాడు అన్నయ్య, అతని బంధువులు, స్నేహితులు. ఇక చేసేది ఏమీ లేక.. రహదారి కూడా లేకపోవటంతో.. చెల్లెలి మృతదేహాన్ని భుజాన మోస్తూ.. అదే రైలు పట్టాల వెంట ఇంటికి తిరుగు ప్రయాణం అయ్యాడు. అలా రెండు కిలోమీటర్లు చెల్లెలి శివాని మృతదేహంతో.. రైలు పట్టాల వెంట.. భుజనా మోస్తూ ఆ అన్నయ్య పడిన వేదన వర్ణనాతీతం. ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ అయ్యింది.

ALSO READ | జమ్మూ కశ్మీర్ లో 4.2 తీవ్రతతో భూకంపం..

వర్షాలు వస్తే గ్రామాల్లో కనీస వైద్య సాయం చేయలేని దుస్థితికి నిదర్శనం అంటే.. ఎంత టెక్నాలజీ వచ్చినా ప్రకృతి విపత్తులను ఆపలేరని మరికొందరు.. ఇలా కామెంట్లు చేస్తూ ఉన్నారు. ఏదిఏమైనా ఇది మాత్రం చాలా విషాదకరం అనటంలో సందేహం లేదు..