ఓ 28 ఏళ్ల యువకుడికి కరోనా సోకడంతో డాక్టర్లు హోంక్వారంటైన్ లో ఉండాలని సూచించారు. కానీ, అతని ఇంట్లో అంత సౌకర్యం లేకపోవడంతో పబ్లిక్ టాయిలెట్ లోనే వారం రోజులు క్వారంటైన్ విధించుకున్నాడు. ఈ ఘటన ఒడిశాలోని జగత్ సింగ్ పూర్ లో జరిగింది. గ్రామానికి చెందిన మానస్ పాత్రా ఉపాధి కోసం తమిళనాడు వెళ్లి అక్కడే ఉంటున్నాడు. అయితే అక్కడ పాత్రాకు కరోనా సోకినట్లు తేలింది. దాంతో అతన్ని అక్కడి ప్రభుత్వం వారం రోజుల పాటు క్వారంటైన్ కేంద్రంలో ఉంచింది. ఆ తర్వాత కరోనా లక్షణాలు తగ్గడంతో పాత్రాను పంపించింది. పాత్రా తాను ఇంకో వారం కూడా ఇక్కడే క్వారంటైన్ లో ఉంటానని అధికారులను అభ్యర్థించాడు. కానీ, దానికి వారు ఒప్పుకోలేదు.
దాంతో పాత్రా తన స్వస్థలానికి చేరుకున్నాడు. అయితే మరో వారం పాటు హోంక్వారంటైన్ లో ఉండాలని వైద్యులు సూచించారు. కానీ, అతని ఇల్లు చాలా చిన్నది. అందులో పాత్రా క్వారంటైన్ లో ఉండటానికి గదులు లేవు. పైగా ఆ చిన్న ఇంట్లో ఆరుగురు ఉంటున్నారు. తాను కూడా అదే ఇంట్లో ఉంటే.. తన వాళ్లకు కూడా కరోనా సోకుతుందని పాత్రా భావించాడు. దాంతో ఏం చేయాలో తోచని పాత్ర.. ఇంటికి దగ్గరలో కడుతున్న పబ్లిక్ టాయిలెట్ ని తన హోంక్వారంటైన్ గా మార్చుకున్నాడు. తనకు తాను పబ్లిక్ టాయిలెట్ లో క్వారంటైన్ విధించుకున్న పాత్రా.. జూన్ 9 నుంచి 15 వరకు అందులోనే ఉన్నాడు. వారం తర్వాత కరోనా లక్షణాలు లేవని తేలడంతో ఇంటికి చేరుకున్నాడు.
For More News..