ఎయిర్​ఫోర్సులో ఉద్యోగాల పేరిట మోసం .. 50 మంది నుంచి రూ.3 కోట్లు వసూలు

ఎయిర్​ఫోర్సులో ఉద్యోగాల పేరిట మోసం .. 50 మంది నుంచి రూ.3 కోట్లు వసూలు

జీడిమెట్ల, వెలుగు: ఇండియన్​ఎయిర్​ఫోర్సులో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ ఓ యువకుడు 50 మంది నిరుద్యోగుల నుంచి రూ.3 కోట్లు కొట్టేశాడు. ఈ ఘటన పేట్​బషీరాబాద్​ పోలీస్ స్టేషన్​ పరిధిలో జరిగింది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్ జిల్లా, పిట్టంకి చెందిన కేతావత్​సంతోశ్​కొంపల్లికి జయబేరీ పార్కులో ఉంటున్నాడు. ఎయిర్​ఫోర్సులో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ పలువురిని నమ్మించాడు.

 ఫేక్​హాల్​టికెట్స్, ఫేక్​ఎగ్జామ్స్ నిర్వహించి ఫేక్​అపాయింట్​మెంట్​లెటర్స్ ఇచ్చాడు. అంతా నిజమేనని నమ్మిన కొందరి నుంచి రూ.6 లక్షల నుంచి రూ.12 లక్షల వరకు వసూలు చేశాడు. చివరికి అవి ఫేక్​అపాయింట్​మెంట్​లెటర్స్​అని తెలిసి, బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గడిచిన రెండేళ్లలో సంతోశ్​50 మందిని మోసం చేసి దాదాపు రూ.3 కోట్లు కొట్టేసినట్లు తెలిసింది. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడు. శనివారం 8 మంది బాధితులు పేట్​బషీరాబాద్ పోలీస్​ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదైంది.