
- ఈ నెల 10న లలితా జువెల్లరీలో ఘటన
పంజాగుట్ట, వెలుగు: లలితా జువెలర్స్ లో అసలు బంగారం స్థానంలో నకిలీది పెట్టి ఓ వ్యక్తి మోసం చేశాడు. మేనేజర్ ఫిర్యాదు ప్రకారం.. గత నెల 10న ఓ వ్యక్తి పంజాగుట్టలోని లలితా జువెల్లరీకి ఓ వ్యక్తి వచ్చాడు. సేల్స్ మెన్‌ని వివిధ రకాల డిజైన్లు చూపించాలని కోరాడు.
సేల్స్‌మెన్ సేల్స్ టెన్షన్ లో ఉండగా అతడి కళ్లు గప్పి అసలు నెక్లెస్ తీసుకుని నకిలీది దాని స్థానంలో ఉంచాడు. ఇటీవల జరిగిన ఆడిట్‌లో నగ కనిపించకపోవడంతో సీసీ కెమెరాలను పరిశీలించగా చోరీ జరిగినట్లు గుర్తించారు. శుక్రవారం షోరూం మేనేజర్ ప్రసాద్ పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు.