అతనికి ఫొటోలు తీయడం సరదానో లేక మెట్రోలో కిక్కిరిసిన జనం ఉండటంతో ఆశ్చర్యంతో తీశాడో తెలియదు కానీ.. ఓ వ్యక్తి క్రౌడ్ ఫొటోలు తీయడం పెద్ద వివాదాస్ప దమైంది..నా ఫొటోలే తీస్తావా అంటూ ఆ క్రౌడ్ లో ఉన్న మహిళ కోపంతో ఊగిపోయింది.. అతన్ని ఎడా పెడా మాటలతో వాయించింది. అంతటితో ఆగక పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది.
డిసెంబర్ 30, 2024..కొత్త సంవత్సరం సమీపిస్తున్న సమయం కూడా..దీంతో బెంగళూరు మెట్రో స్టేషన్లు, మెట్రోరైళ్లు జనంతో కిక్కిరిసి పోయాయి. క్రౌడ్ ఎన్నడూ ఇసుక వేస్తే రాలనంతగా ఉంది.. దీంతో కొంత ఆశ్యర్యానికి గురైన మహేష్ అనే ప్రయాణికుడు జనాన్ని ఫొటోలు తీయడం మొదలు పెట్టాడు.. అదే పెద్ద వివాదమైంది.. అతన్ని పోలీస్ స్టేషన్ కు ఈడ్చింది.
ALSO READ | మైండ్ బ్లోయింగ్: ఆ రోడ్డు నుంచి ఈ రోడ్డుకు.. పల్టీలు కొట్టుకుంటూ వచ్చిన స్కూల్ బస్సు
మహేష్ అనే వ్యక్తి కదులుతున్న మెట్రో రైలులో జనరల్ గా ఫొటో తీస్తున్నాడు..అది గమనించిన ఓమహిళ మహేష్ పై విరుచుకుపడింది. ఓ రేంజ్ లో తిట్ల దండకం అందుకుంది. ఫొటోలు ఎందుకు తీస్తున్నావు..అందులో నా ఫొటోలు కూడా ఉన్నాయి.. వెంటనే డిలిట్ చేయాలని అని కోపంతో ఊగిపోయింది.. ఆమె 112 కి కాల్ చేయడంతో పోలీసులు ఇద్దరిని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు.
అయితే అతను ఎలాంటి అభ్యంతర కరమైన ఫొటోలు తీయలేదు.. అయితే ఆమె తన ఫొటోను తొలగించాలని కోరింది.. నాక్ కాగ్నిజబుల్ రిపోర్టు దాఖాలు చేసిన పోలీసులు తెలిపారు. అయితే మహేష్ ఇంతకు ముందు మహిళలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలాంటి ఏమైనా తీశాడా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.