సెల్ టవర్ ఎక్కి వ్యక్తి నిరసన

సెల్ టవర్ ఎక్కి వ్యక్తి నిరసన

శంకరపట్నం, వెలుగు:  తనను తన భార్యను `కొట్టిన తమ్ముడిపై చర్యలు తీసుకోవాలని ఓ వ్యక్తి సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపాడు. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం ఎక్లాస్‌‌పూర్  గ్రామానికి చెందిన దుర్గం కొమురయ్య కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కేశవపట్నం గ్రామంలో సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపారు. 

అవమానంతో తన భార్య పురుగుల మందు తాగిందని, 15 రోజులకు ఆసుపత్రిని నుంచి డిశ్చార్చ్ అయిందని బాధితుడు వాపోయాడు. అయినా ఇప్పటివరకు తన తమ్ముడిపై చర్చలు తీసుకోలేదని ఆరోపించారు. సైదాపూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదంటూ సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపాడు.  సమాచారం అందుకున్న బ్లూ కోర్టు పోలీసులు సెల్ టవర్ వద్దకు చేసుకొని న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో సెల్ టవర్ దిగాడు.