అంబర్పేట్లో వ్యక్తి హల్చల్

అంబర్పేట్లో ఓ వ్యక్తి మద్యం మత్తులో హల్చల్ చేశాడు. హైటెన్షన్ టవరెక్కి పోలీసులను ఉరుకులు పరుగులు పెట్టించాడు. మోహన్ అనే వ్యక్తి తన తోపుడు బండిని ఎవరో దొంగిలించారని, దాన్ని వెంటనే తెచ్చివ్వాలంటూ హై టెన్షన్ టవర్ ఎక్కాడు. ఆ సమయంలో కరెంటు సప్లై లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. విషయం తెలియడంతో భారీ సంఖ్యలో స్థానికులు అక్కడకు చేరుకున్నారు. కిందికి దిగిరావాలని ఎంత మంది చెప్పినా వినిపించుకోలేదు. పోలీసులకు సమాచారం అందడంతో వారు ఘటనా స్థలానికి చేరుకున్నారు. తోపుడు బండి వెతికి తెచ్చిస్తామని నచ్చజెప్పి కిందికి దింపారు. మద్యం మత్తులోనే అతను స్తంభంపైకి ఎక్కాడని పోలీసులు చెప్పారు.

For more news..

పలువురు ఐపీఎస్లకు తాత్కాలిక పోస్టింగ్

కాల్పుల విరమణ ప్రకటించిన రష్యా