
రామాయంపేట,వెలుగు : పైసల ఆటలో పోయిన డబ్బులు ఇప్పించాలని స్ట్రీట్ లైట్ స్తంభం ఎక్కి ఓ వ్యక్తి హల్చల్చేసిన సంఘటన రామాయంపేటలో మంగళవారం జరిగింది. ఎస్ఐ బాలరాజ్ కథనం ప్రకారం.. మున్సిపల్ పరిధిలోని విఠల్ పైసల ఆటలో వంద రూపాయలు పోగొట్టుకోగా వాటిని ఇప్పించాలని ఎస్ఐని కోరాడు.
ఈ విషయంలో అతడిని సముదాయిస్తున్న క్రమంలోనే పక్కనే ఉన్న స్త్రీట్ లైట్ పోలు ఎక్కాడు. వెంటనే వంద రూపాయలు సిద్దరాములు నుంచి ఇప్పించాలని లేదంటే పైనుంచి కిందకు దూకుతానని బెదిరించాడు. దీంతో పోలీసులు, ఫైర్ సిబ్బంది అక్కడకు చేరుకుని అతడికి నచ్చజెప్పి కిందకు దింపారు.