
- శంకర్పల్లి పీఎస్ పరిధిలో ఘటన
శంకర్పల్లి, వెలుగు: వివాహేతర సంబంధం బయటపడిందనే మనస్తాపంతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన శంకర్ పల్లి పీఎస్ పరిధిలో జరిగింది. ఎస్సై సంతోష్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. శంకర్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని బుల్కాపూర్కి చెందిన రైతు శంకరయ్య(38)కు లలిత అనే మహిళతో పెళ్లి కాగా.. కూతురు, కొడుకు ఉన్నారు. భార్యభర్తల మధ్య గొడవలు రావడంతో శంకరయ్య లక్ష్మి అనే మరో మహిళను పెళ్లి చేసుకున్నాడు.
అయితే, ఏడాది కాలంగా వరుసకు చిన్నమ్మ అయ్యే మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. విషయం తెలుసుకున్న భార్య లక్ష్మి పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టించింది. మనస్తాపానికి గురైన శంకరయ్య మంగళవారం ఇంట్లో ఉరేసుకున్నాడు. పోలీసులు కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేపట్టారు.