హైదరాబాద్ ట్యాంక్ బండ్ మీద నుంచి దూకి వ్యక్తి సూసైడ్

హైదరాబాద్ ట్యాంక్ బండ్ మీద నుంచి దూకి వ్యక్తి సూసైడ్

ట్యాంక్ బండ్, వెలుగు: అప్పర్ ట్యాంక్ బండ్ పై నుంచి దూకి శనివారం (March 15) రాత్రి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడని దోమలగూడ ఇన్​స్పెక్టర్​ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. కూకట్​పల్లిలో ఉండే జి రాకేశ్​ (43) లోయర్ ట్యాంక్ బండ్ లోని కట్ట మైసమ్మ ఆలయం వద్ద పడి ఉన్నట్టు సమాచారం అందింది. వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. అతన్ని పరిశీలించగా.. తలకు బలమైన గాయాలు కావడంతో చనిపోయి ఉన్నాడ.

 మృతుని కుటుంబానికి సమాచారం అందించారు. కూతురు అక్కడికి చేరుకొని.. మెడ నొప్పి, మానసికంగా ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకొని ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేసింది. మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.