- భూమిలో టెంపుల్ కడతానని దౌర్జన్యం
- సోషల్ మీడియాలో వీడియో వైరల్
కూసుమంచి, వెలుగు : ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలోని నాయకన్‌గూడెం బీఆర్ఎస్సర్పంచ్ కాసాని సైదులు వేధిస్తున్నాడని ఓ బాధితుడు బుధవారం వీడియో తీసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. బాధితుడి కథనం ప్రకారం..మండలంలోని కొత్తూరు గ్రామానికి చెందిన పోలేబోయిన ఉపేందర్ కు నాయకన్‌గూడెం హైవేలో ఎకరం 26 గుంటల భూమి ఉంది. ఈ స్థలంలో సర్పంచ్ సైదులు కంఠమహేశ్వరస్వామి ఆలయం నిర్మించడానికి పూనుకున్నాడు. దీనికి ఉపేందర్ఒప్పుకోలేదు. తన భూమిలో తనకు ఇష్టం లేకుండా ఆలయం ఎలా కడతారని ప్రశ్నించాడు. దీంతో 15 రోజుల నుంచి అతడిని వేధిస్తున్నాడు. ఇది భరించలేక ఉపేందర్ ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. తన సూసైడ్‌కు సర్పంచ్సైదులే కారణమంటూ బుధవారం మధ్యాహ్నం సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. తర్వాత పురుగుల మందు తాగాడు. కొద్దిసేపటికి అటువైపు వెళ్తున్న రైతులు కిందపడి ఉన్న ఉపేందర్‌ను చూసి 108 లో ఖమ్మంలోని ఓ ప్రైవేట్దవాఖానకు తరలించారు. ఎస్ఐ రమేశ్‌కుమార్‌ను తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని చెప్పారు.