చిన్నారి చేతిలో పేలిన గన్.. తల్లి ప్రియుడికి తాకిన బులెట్​

చిన్నారి చేతిలో పేలిన గన్.. తల్లి ప్రియుడికి తాకిన బులెట్​
  • అమెరికాలోని వర్జీనియాలో ఘటన

వాషింగ్టన్: రెండేండ్ల చిన్నారి ప్రమాదవశాత్తు తల్లి ప్రియుడిని గన్​తో కాల్చింది. అమెరికాలోని వర్జీనియా రాష్ట్రం చెస్టర్​ఫీల్డ్​లో ఈ ఘటన చోటుచేసుకుంది. బట్లర్ లేన్​లో ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి, ఆమె ప్రియుడు నివాసం ఉంటున్నారు. ప్రియుడు సోమవారం బయటికి వెళ్లేందుకు రెడీ అవుతుండగా, ఆడుకుంటున్న చిన్నారి చేతిలోని  గన్ పేలింది.

ప్రియుడికి బులెట్ తగిలి కుప్పకూలిపోయాడు. ఫైరింగ్ సౌండ్ విన్న కుటుంబ సభ్యులు వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి కండిషన్ సీరియస్​గా ఉందని డాక్టర్లు చెప్పారు. ఆ చిన్నారి చేతిలో కి గన్ ఎలా వచ్చిందనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.