ఇదెక్కడి పిచ్చిరా బాబు.. చంద్రబాబు కోసం నాలుక కోసుకున్నాడు..

ఇదెక్కడి పిచ్చిరా బాబు.. చంద్రబాబు కోసం నాలుక కోసుకున్నాడు..

పిచ్చి పలురకాలు, కొందరికి సినిమా పిచ్చి ఉంటుంది, కొంతమందికి స్పోర్ట్స్ పిచ్చి ఉంటుంది, ఇంకొంత మందికి పాలిటిక్స్ పిచ్చి ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక పిచ్చి ఉండటం మాములే కానీ, మితి మీరిన పిచ్చి ప్రమాదకరం అని చెప్పాలి. చంద్రబాబు మీద పిచ్చి అభిమనంతో ఒక వ్యక్తి తన ప్రాణానికే ప్రమాదం తెచ్చుకున్నంత పని చేసాడు. 

హైదరాబాద్ బంజారా హిల్స్ పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది ఈ సంఘటన.మహేష్ అనే వ్యక్తి చంద్రబాబు సీఎం కావాలని తన నాలుక కోసుకొని దేవుడి హుండీలో వేశాడు.శ్రీనగర్ కాలనీలోని వెంకటేశ్వర టెంపుల్ వద్ద అనే వ్యక్తి చంద్రబాబు నాయుడు AP కి ముఖ్యమంత్రి కావాలని తన నాలుక కోసుకున్నాడు.గతంలో కూడా వైఎస్ జగన్ సీఎం కావాలని ఇదే గుడి ముందు ఇదే వ్యక్తి నాలుక కోసుకోవటం ఇక్కడ ట్విస్ట్. 

ఈసారి ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ఏపీకి ముఖ్యమంత్రి కావాలని నాలుక కోసుకొని మొక్కు తీర్చుకున్నాను అంటూ లెటర్లో పేర్కొన్నాడు మహేష్. పిఠాపురంలో పోటీచేసిన పవన్ కళ్యాణ్ కూడా భారీ మెజార్టీతో గెలవాలని లెటర్లో రాశాడు మహేష్. స్థానికుల ఫిర్యాదుతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మహేష్ ను స్థానికంగా ఉన్న ప్రైవేట్ హాస్పిటల్లో ప్రధమ చికిత్స అందించి ఉస్మానియా హాస్పిటల్ కి తరలించారు.