
డ్యాన్సింగ్ కాప్గా దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఇండోర్ ట్రాఫిక్ పోలీస్ జవాన్ కున్వర్ రంజిత్ సింగ్ గురించి అందరికీ తెలిసిందే. డ్యూటీలో భాగంగా మూన్ వాక్ స్టెప్పులతో ట్రాఫిక్ కంట్రోల్ చేసే ఆయన.. ఓ అంకుల్ వేసిన డ్యాన్స్ స్టెప్పులు చూసి అవాక్కయ్యాడు. అంకుల్తో కలిసి కాసేపు స్టెప్పులేసిన రంజిత్ సింగ్.. ఆయన ఊపును చూసి పక్కకు తప్పుకున్నాడు. అమితాబ్ బచ్చన్, పర్వీన్ బాబీ నటించిన జానూ మేరీ జాన్ పాటకు మైమరిచిపోయి స్టెప్పులేసిన అంకుల్ డ్యాన్స్ వీడియోను ఐపీఎస్ ఆఫీసర్ దీపాంశు కబ్రా ట్విట్టర్ లో పోస్ట్ చేయగా.. ప్రస్తుతం అది ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. అంకుల్ స్టెప్పులు చూసిన నెటిజన్లు ఆయనకు ఫ్యాన్స్ అయిపోతున్నారు.
ऐसे पल #PublicPoliceFriendship के खूबसूरत उदहारण हैं! #DancingCop #DancingWithCop. pic.twitter.com/8Y11Nf5sOO
— Dipanshu Kabra (@ipskabra) April 25, 2022