హైదరాబాద్ లోని మియాపూర్ లో దారుణం చోటు చేసుకుంది.. విద్యుత్ షాక్ తగిలి భవనంపై నుండి కిందపడి ఓ వ్యక్తి అక్కడిక్కడే మృతి చెందాడు. సోమవారం ( అక్టోబర్ 28, 2024 ) చోటు చేసుకుంది ఈ ఘటన. కొత్తగా నిర్మిస్తున్న భవనంలో క్రేన్ ఆపరేట్ చేస్తుండగా విద్యుత్ షాక్ తగిలి మూడో అంతస్తు పైనుండి కిందపడి వ్యక్తి అక్కడిక్కడే మృతి చెందాడు.ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలిలా ఉన్నాయి. కూకట్ పల్లి జగద్గిరిగుట్టలో నివాసం ఉంటు క్రేన్ ఆపరేటర్ గా పనిచేస్తున్నాడు 45 ఏళ్ళ యాదగిరి.
క్రేన్ ఆపరేట్ చేస్తుండగా విద్యుత్ షాక్ తగలటంతో తీవ్ర రక్తస్రావంతో అక్కడిక్కడే మృతి చెందాడు యాదగిరి. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు స్థానికులు. ఘటన స్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్ కు తరలించారు పోలీసులు.స్థానికుల ఫిర్యాదుతో ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.