మంత్రాలయ్ కంట్రోల్ రూమ్‌కు 2023 ఆగస్టు 08 సోమవారం రాత్రి బెదిరింపు కాల్ వచ్చింది. మరో రెండు రోజుల్లో ముంబైలో ఉగ్రదాడి జరగబోతోందని ఫోన్ చేసిన వ్యక్తి బెదిరించాడు. దీంతో పోలీసులు ఆలెర్ట్ అయ్యారు. కాల్ చేసిన వ్యక్తిని పోలీసులు ట్రాక్ చేసి అరెస్ట్ చేశారు. కాల్ చేసిన వ్యక్తిని ప్రకాష్ కిషన్‌చంద్ ఖేమానీగా, అతని వయసు 61గా గుర్తించారు.
పోలీసులు ఈ విషయంలో మరింత దర్యాప్తు చేస్తున్నారు. తనకు ఉగ్రవాదులతో సంబంధాలున్నాయని నిందితుడు ప్రకాష్ కిషన్‌చంద్ చెప్పినట్లుగా పోలీసులు తెలిపారు. వారు మరో రెండు రోజుల్లో మంత్రాలయంలో జరగనున్న ఓ కార్యక్రమానికి హాజరవురాని అతను తమతో చెప్పినట్లు వెల్లడించారు. అతడిని ఈరోజు కోర్టులో హాజరుపరచనున్నారు.