నాకు రావాల్సిన పైసా.. అణా అయినా.. అర్థ అణా అయినా.. అది ఏడుకొండలపై ఉన్నా.. ఏడు సముద్రాలు దాటి ఉన్నా.. పోయి తెచ్చుకునేది పుష్పగాడి అలవాటు.. ఇది పుష్ప 2 మూవీలోని ఓ పాపులర్ డైలాగ్.. ఇప్పుడు ఇదే తరహాలో ఓ ఘటన ఉత్తరప్రదేశ్ లో జరిగింది. 10 రూపాయలు ఇచ్చిన అప్పును.. తిరిగి తీసుకునేందుకు.. 18 నెలలు వెంటాడాడు.. వేధించాడు.. అయినా వాడు ఆ 10 రూపాయలు ఇచ్చేందుకు ససేమిరా అన్నాడు.. చివరి ఏం జరిగింది.. ఆ 10 రూపాయల కోసం ఆ వ్యాపారి ప్రయత్నాలు ఫలించాయా లేదా అనేది డీటెయిల్డ్ గా తెలుసుకుందాం..
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం హర్డోయ్ ఏరియాలోని భండారీ గ్రామం. జితేందర్ అనే దివ్యాంగుడు.. లోకల్ గా పాన్ షాపు నిర్వహిస్తున్నాడు. 18 నెలల క్రితం.. సంజయ్ అనే కుర్ర కస్టమర్ వచ్చాడు. 10 రూపాయల విలువైన గుట్కా ప్యాకెట్ తీసుకున్నాడు. అది కూడా అప్పుగా.. రేపు ఇస్తాను అని చెప్పి 10 రూపాయల గుట్కా ప్యాకెట్ తీసుకెళ్లాడు. ఆ రేపు కాస్తా.. రేపు.. రేపు అంటూ ఏడాదిన్నర అయిపోయింది. అయినా వదల్లేదు పాన్ షాపు ఓనర్ జితేందర్.. వెంటాడు.. కనిపించినప్పుడల్లా అడిగాడు.. అయినా కస్టమర్ సంజయ్ మాత్రం ఆ 10 రూపాయలు తిరిగి ఇవ్వలేదు.
దీంతో విసిగిపోయిన పాన్ వ్యాపారి జితేందర్.. పోలీసులకు ఫోన్ చేశాడు. డయల్ 112 కాల్ చేసి విషయం మొత్తం చెప్పాడు. పోలీస్ స్టేషన్ వరకు వచ్చి కంప్లయింట్ చేయలేను అని.. నేను దివ్యాంగుడిని అని చెప్పుకొచ్చాడు. దీంతో పోలీసులే ఆ గ్రామానికి వెళ్లారు. అప్పు తీసుకున్న సంజయ్ దగ్గరకు వెళ్లి.. అతనితో.. పాన్ వ్యాపారి జితేందర్ కు ఆ10 రూపాయలు ఇప్పించారు. దీంతో ఈ 10 రూపాయల అంశం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. పోలీసుల చిత్తశుద్ధిని కొంత మంది పొగడ్తలతో ముంచెత్తుతుంటే.. ఇదే చిత్తశుద్ధి చిటీల పేరుతో.. ఉద్యోగాల పేరుతో మోసం చేస్తున్న వారి విషయంలోనూ చూపించాలని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు..
ఏదిఏమైనా ఓ దివ్యాంగుడికి అయితే న్యాయం జరిగింది కదా..