సిద్దిపేట రూరల్, వెలుగు: రంగనాయక సాగర్ కెనాల్ లో పడి ఓ వ్యక్తి గురువారం చనిపోయాడు. సిద్దిపేట వన్ టౌన్ పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని గణేష్ నగర్ కు చెందిన మరిగంటి సత్యనారాయణాచార్యులు(51) పౌరోహిత్యం చేస్తుంటాడు. కుటుంబ సమస్యలు పెరిగిపోవడంతో జీవితంపై విరక్తి చెంది మంగళవారం ఇమాంబాద్ లో పూజ చేసేందుకు వెళ్తున్నట్లు ఇంట్లో చెప్పిన ఆయన రెండు రోజులుగా ఇంటికి రాలేదు.
కాగా అతడి కుమారుడు హయగ్రీవ చార్యులు తన ఫోన్లో గుర్తుతెలియని మృతదేహం అని వార్త రాగానే గవర్నమెంట్ ఆసుపత్రికి వెళ్లి మార్చురీ గదిలో చూడగా తన తండ్రిదిగా గుర్తించాడు. మృతుడి భార్య కల్యాణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ భిక్షపతి తెలిపారు.