వడ్డీ వ్యాపారి వేధింపులు.. సెల్ఫీ వీడియో తీసి క్యాబ్ డ్రైవర్ ఆత్మహత్య

వడ్డీ వ్యాపారి వేధింపులు.. సెల్ఫీ వీడియో తీసి క్యాబ్ డ్రైవర్ ఆత్మహత్య

మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ లో  వడ్డీ వ్యాపారి వేధింపులతో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు.  జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని రంగా నగర్ లో డిసెంబర్ 3న ఈ ఘటన జరిగింది.  క్యాబ్ నడుపుతూ జీవనం సాగిస్తున్న శ్రీకాకుళం చెందిన సంతోష్ (34)  పిల్లల పీజుల కోసం అప్పు చేశాడు.   గత మూడు నెలలుగా వడ్డీ చెల్లించ లేదని వడ్డీ వ్యాపారి ఒత్తిడి చేశాడు.  దీంతో సెల్ఫీ వీడియో తీసి ఆత్మహత్య చేసుకున్నాడు సంతోష్.  

 నా భర్త సంతోష్  వడ్డీ వ్యాపారి దగ్గర 60 వేలు అప్పుగా తీసుకున్నాడు. ఆర్థిక ఇబ్బందుల వల్ల తిరిగి చెల్లించలేకపోయాడు.  వ్యాపారి డబ్బులు కట్టాలని ఒత్తిడి తెచ్చాడు. దీంతో నా భర్త సంతోష్ డిసెంబర్ 3న  ఇంట్లో  సీలింగ్ ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వడ్డీ వ్యాపారిపై చర్యలు తీసుకోవాలని మృతుడి భార్య రూప  ఫిర్యాదులో తెలిపారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.