మొక్కజొన్న కంకులు తిని వ్యక్తి మృతి.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఘటన

మొక్కజొన్న కంకులు తిని వ్యక్తి మృతి.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఘటన

జూలూరుపాడు, వెలుగు: మేల్‌‌‌‌, ఫీమేల్‌‌‌‌ మొక్కజొన్న కంకులు తిన్న ఓ వ్యక్తి అస్వస్థతకు గురై చనిపోయాడు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం వినోభానగర్‌‌‌‌ గ్రామంలో ఆదివారం జరిగింది. కుటుంబ సభ్యులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వినోభానగర్‌‌‌‌ గ్రామానికి చెందిన జర్పల కృష్ణ (30) తనకున్న ఐదు ఎకరాల్లో మేల్‌‌‌‌, ఫీమేల్‌‌‌‌ రకం మొక్కజొన్న సాగు చేస్తున్నాడు. తోటకు కాపలాగా వెళ్తున్న క్రమంలో కంకులు కాల్చుకొని తిన్నాడు. ఈ క్రమంలో ఆదివారం తీవ్ర ఒళ్లునొప్పులతో అనారోగ్యానికి గురయ్యాడు. గమనించిన కుటుంబ సభ్యులు కొత్తగూడెం హాస్పిటల్‌‌‌‌కు తీసుకెళ్తుండగా మార్గ మధ్యలోనే చనిపోయాడు.