కోతులను కొట్టబోయి బావిలో పడి వ్యక్తి మృతి.. వరంగల్ జిల్లా మడిపల్లిలో ఘటన

కోతులను కొట్టబోయి బావిలో పడి వ్యక్తి మృతి.. వరంగల్ జిల్లా మడిపల్లిలో ఘటన

నెక్కొండ, వెలుగు: కోతులను కొట్టబోయి ప్రమాదవశాత్తు బావిలో పడి వ్యక్తి మృతి చెందిన ఘటన వరంగల్​ జిల్లాలో జరిగింది. నెక్కొండ మండలం మడిపల్లికి చెందిన రైతు తేజావత్​వెంకన్న(35) ఇంటి ఆవరణలోని మంగళవారం ఉదయం కోతుల గుంపు వచ్చింది. 

అతడు వాటిని కొట్టబోయే క్రమంలో పక్కనే ఉన్న బావిలో జారిపడ్డాడు. దీంతో తలకు తీవ్రగాయాలై స్పాట్ లో చనిపోయాడు. మృతుడి భార్య సునీత ఫిర్యాదుతో  కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ మహేందర్​ తెలిపారు.