కీసర, వెలుగు: మేడ్చల్ జిల్లా కీసర పరిధిలో కాంట్రాక్టర్ నిర్లక్ష్యం ఒకరి ప్రాణం తీసింది. రాంపల్లి నుంచి చర్లపల్లి వెళ్లే మార్గంలో రోడ్డు విస్తరణ పనులు చేపట్టారు. సూచిక బోర్డులు ఏర్పాటు చేయకుండా రోడ్డు అడ్డగా మట్టికుప్పలు పోశారు. అయితే, బుధవారం బైక్‌పై అటుగా వెళ్తున్న ఓ వ్యక్తి రాత్రిపూట మట్టికుప్పలు కనిపించకపోవడంతో కిందపడ్డాడు.
తలకు తీవ్ర గాయం కావడంతో స్పాట్లోనే మృతి చెందాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. మృతుడిని రాంపల్లి గ్రామానికి చెందిన అంకర్ల శివ కుమార్‌గా గుర్తించారు.