
- చెత్త సేకరిస్తుండగా చెరువులో పడ్డ యువకుడు
జీడిమెట్ల, వెలుగు: తల్లి కండ్ల ముందే చెరువులో మునిగి కొడుకు చనిపోయిన ఘటన బాచుపల్లి పీఎస్పరిధిలో జరిగింది. సీఐ ఉపేందర్తెలిపిన వివరాల ప్రకారం.. సంగారెడ్డిజిల్లా హత్నూరకు చెందిన వెంకటేశ్(29) కుటుంబం ఐడీఏ బొల్లారంలో ఉంటోంది. చెత్త ఏరుకుని జీవనం సాగిస్తోంది. వెంకటేశ్తన తల్లితో కలిసి సోమవారం బాచుపల్లి బైరుని చెరువు వద్ద చెత్తను సేకరిస్తున్నాడు. ప్రమాదవశాత్తు చెరువులో పడ్డాడు. గమనించిన తల్లి, స్థానికులు బాచుపల్లి పోలీసులకు సమాచారం ఇచ్చారు.
డీఆర్ఎఫ్ బృందం, బాచుపల్లి పోలీసులు చెరువులో గాలించగా వెంకటేశ్ మృతదేహం లభ్యమైంది. వెంకటేశ్ కు, భార్య శ్వేతకు మధ్య గొడవలు జరగుతున్నాయి. ఈ నేపథ్యంలో అతడు చెరువులో దూకాడా? లేక మద్యం మత్తులో పడిపోయాడా? అనే విషయం తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.