సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో పండుగ పూట విషాద ఘటన చోటుచేసుకుంది. పట్టణంలోని ఏనే వద్ద రాత్రి వేళ లిఫ్ట్ అడుగుతున్న ఓ వ్యక్తిని ద్విచక్ర వాహనదారుడు ఢీకొని మృతి చెందిన ఘటన మంగళవారం రాత్రి సమయంలో చోటును చేసుకుంది. అక్కన్నపేట మండలం చౌటపల్లి గ్రామానికి చెందిన సంపత్ అనే వ్యక్తి తన స్వగ్రామం నుంచి హుస్నాబాద్ కి వెళ్తుండగా మార్గ మధ్యంలో ఓ వ్యక్తి లిఫ్ట్ అడిగాడు. దీంతో బైక్ ని ఆపేందుకు ప్రయత్నించినప్పటికీ కంట్రోల్ కాకపోవడంతో లిఫ్ట్ అడిగిన వ్యక్థని ఢీ కిట్టింది.
ALSO READ | ఎన్నిసార్లు చెప్పిన మీరు మారరా..?: బైక్పై వెళ్తున్న గొంతు తెంపిన చైనా మాంజా
దీంతో సంపత్ క్రిందపడి అక్కడిక్కడే మృతి చెందాడు. స్థానికులు గమనించి ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలం వద్ద ఉన్న సిసి కెమెరాలను పరిశీలించగా ఈ విషయం బయటపడింది. సంక్రాంతి పండగ వేళ ఇలాంటి సంఘటన జరగడంతో సంపత్ కుటుంబం తీవ్ర శోక సంద్రంలో మునిగిపోయింది.