కర్ణాటకలో 65 ఏళ్ల వ్యక్తి కరోనా బారిన పడి చనిపోయాడు. ఈ వ్య్తక్తి మరణంతో కర్ణాటకలో కరోనా వల్ల చనిపోయిన వారి సంఖ్య మూడుకు చేరింది. ఈ వ్యక్తి మార్చి 11న ఢిల్లీనుంచి వచ్చినట్లు తుమ్కూర్ డిప్యూటీ కమిషనర్ కె. రాకేశ్ కుమార్ తెలిపారు. ఈ చనిపోయిన వ్యక్తి దాదాపు 33 మందిని కలిసినట్లు ఆయన తెలిపారు. అయితే చనిపోయిన వ్యక్తికి ముగ్గురు భార్యలు, 16 మంది పిల్లలు ఉన్నారని సమాచారం. అయితే వారికి కూడా కరోనా సోకి ఉండవచ్చని వారి ఇంటి చుట్టుపక్కల వాళ్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దాంతో మృతుని భార్యలను, పిల్లలను హోం క్వారంటైన్ లో ఉంచినట్లు కమిషనర్ రాకేష్ కుమార్ తెలిపారు. అంతేకాకుండా అతని కుటుంబంతో సన్నిహిత సంబంధాలున్న మరో 10 మందిని కూడా నిర్భంధించినట్లు ఆయన తెలిపారు.
కర్నాటకలో ఇప్పటివరకు 91 కరోనా కేసులు నమోదయ్యాయి. వీరిలో ఆరుగురు డిశ్చార్జ్ కాగా.. ముగ్గురు మరణించారు. కరోనా బారిన పడిన వారిలో 10 నెలల బాలుడు కూడా ఉన్నాడు. దేశంలో కరోనా బారిన పడిన అతి చిన్న వయసు గల కేసు ఇదే. ఈ బాలుడు దక్షిణ కర్ణాటకకు చెందిన వాడు. ఈ బాలుడి కుటుంబం ఇటీవలే కేరళకు వెళ్లి వచ్చింది. ఆ బాలుడి కుటుంబాన్ని ఒక ఆస్పత్రిలో ఐసోలేషన్ లో ఉంచారు.
దేశవ్యాప్తంగా 1453 మంది కరోనా బారిన పడ్డారు. దాదాపు 47 మంది చనిపోగా.. 140 మంది కోలుకున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతోంది.
For More News..
ప్రభుత్వోద్యోగుల్లో ఎవరెవరికి ఎంత జీతం కోత?
ఇక్కడున్న పక్క రాష్ట్రాల వారికీ బియ్యం, నగదు
మూడు రోజుల్లోనే 6 లక్షలు దాటిన కరోనా కాల్స్
కరోనా విరాళాలను వదలని సైబర్ దొంగలు