టూమచ్ రా రేయ్ : అరబ్ షేక్ వేషంలో కుంభమేళాకు.. చితక్కొట్టిన సాధువులు

టూమచ్ రా రేయ్ : అరబ్ షేక్ వేషంలో కుంభమేళాకు.. చితక్కొట్టిన సాధువులు

నలుగురిలోకి వెళ్లినప్పుడు బుద్ధిగా ఉండాలి.. లేకపోతే ఇలాగే జరుగుతుంది.. కొన్ని సార్లు అభాసుపాలు అవుతాం.. మరికొన్ని సార్లు దెబ్బలూ తింటాం. హిందూవులు ఎంతో పవిత్ర పుణ్యంగా భావించే మహా కుంభమేళాకు.. అరబ్ ముస్లింలు ధరించే వస్త్రధారణతో ఓ వ్యక్తి వచ్చాడు. అతడు హిందూవే. కాకపోతే రీల్స్ కోసం.. రీల్స్ లైకుల కోసం ఈ ఐడియా వేశాడు. పోనీ, వెళ్లినోడు బుద్ధిగా తన మానాన తను ఉండాలా..! ఉండలే. నిజమైన అరబ్ షేక్‌లా పోజులిస్తూ.. సాధవులను చూస్తూ ఓవరాక్షన్ చేశాడు. అంతే సాధువులు అందరూ కలిసి కుమ్మేశారు.. ఏదో అనుకుంటే ఇంకేదో అయినట్లు.. పాపం మనోడు ఒళ్లు హూనం అయ్యిందట..

Also Read : ప్రేమలో మోసం చేసిన వాళ్లకి ఎలాంటి శిక్ష వేయాలి

నెట్టింట వైరలవుతోన్న వీడియోలో సదరు యువకుడు అరబ్ షేక్ వేషంలో మొదట బాగానే వచ్చాడు. అతనితో పాటు మరో ఇద్దరు యువకులు వెన్నంటే ఉన్నారు. ఆ ఇద్దరు సదరు అరబ్ షేక్ కు బాడీగార్డుల్లాగా నటిస్తున్నారు. మరో యువకుడు ఇదంతా వీడియో తీస్తున్నాడు. అంతలోనే అక్కడి పరిస్థితి ఒక్కసారిగా గందరగోళంగా మారింది. సాధువులు గుమిగూడి.. వేషం వేసిన అరబ్ షేక్‌తో వాగ్వాదానికి దిగారు. అతడు ఎదురు తిరిగే ప్రయత్నం చేయడంతో అందరూ కలిసి యువకుడిని చితక బాదారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.