ఇంత టాలెంట్ ఏంట్రా:కారును బెడ్గా మార్చేశాడు..వీధుల్లో షికార్లు..వీడియో వైరల్

ఇంత టాలెంట్ ఏంట్రా:కారును బెడ్గా మార్చేశాడు..వీధుల్లో షికార్లు..వీడియో వైరల్

ప్రయాణానికి ఎప్పుడూ కార్లు, బైకులే ఉపయోగించాలా? లాంగ్ డ్రైవ్ బైక్ పై వెళ్తూ బ్యాక్ పెయిన్ తో ఇబ్బంది పడాలా? క్యాబ్ బుక్ చేసుకొని హడావుడిగా ప్రయాణం సాగించాలా? వెరైటీగా ఎందుకు ట్రై చేయకూడదు..ఇవన్నీ లేకుండా బెడ్ పై సౌకర్యవంతమైన ప్రయాణం చేస్తే ఎంత బాగుంటుందో అనిపిస్తుందా..ఒకసారి ఊహించుకోండి..ఇక బెడ్ కారులో షికారుకెళితే ఎలా ఉంటుందో డ్రీమ్ వేసుకోండి..బెడ్ పై ప్రయాణం ఏంటీ? అనుకుంటున్నారా? కోల్కతాకు చెందిన ఈ వ్యక్తిని చూడండి..దర్జాగా వీధుల్లో పెళ్లికొడుకు గెటప్లో బెడ్ డ్రైవ్ చేసుకుంటూ ఎలా వెళ్తున్నాడో..ఇతని బెడ్ ప్రయాణం చూస్తే మీకూ ఓసారి ట్రిప్ వేస్తే బాగుండు అనిపిస్తుంది..ఆ బెడ్ డ్రైవ్ కథేంటీ చూద్దాం రండి..

కోల్కతాకు చెందిన నవాబ్ షేక్(27) పెళ్లికొడుకు గెటప్లో వీధుల్లో బెడ్ కారుపై తిరుగుతున్న దృశ్యాలకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. వీధుల్లో కారు వెళ్తుంటే వారినే కాదు.. నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. నవాబ్ షేక్ బెడ్ కారులో హాయిగా, ఎటువంటి కుదింపులు లేకుండా సౌకర్యవంతంగా వెళ్తుంటే జనాలు చూసి ఆశ్చర్యపోయారు. వింతగా చూశారు. 

ఆ వీడియోలో నవాబ్ తన మోడిఫైడ్ కారు స్టీరింగ్ వీల్ పట్టుకుని ఆనందంగా నడుపుతున్నట్లు వీడియో కనిపిస్తుంది. అతను తన ఒక చేతిని దిండుపై, మరొక చేతిని స్టీరింగ్‌పై ఉంచి కారును నియంత్రిస్తూ అదే సమయంలో తన కుషన్ బెడ్ సౌకర్యాన్ని ఆస్వాదిస్తున్నాడు.

నవాబ్ బెడ్  కారుకు అన్ని ఉన్నాయి. స్టీరింగ్, బ్రేకులు, స్టీరింగ్, క్లచ్, సైడ్ మిర్రర్, నాలుగు వీల్స్ ఇలా కారుకు ఉండాల్సిన అన్ని ఈ బెడ్ కారుకు ఉన్నాయి. దీని సీటింగ్ విధానం హైలైట్. ఇది కారు సీటులా కాకుండా చాలా సౌకర్యవంతంగా ఉంది. ఇక ఈ కారులో బెడ్పై ఉంది. నవాబ్ ఈ బెడ్ కారు గురించి చెబుతూ..ఈ కారును తయారు చేసేందుకు చాలా సమయం, ఖర్చు వెచ్చించి శ్రమించానన్నాడు.ఈ సాంప్రదాయబద్దమైనకారు ను తయారు చేసేందుకు దాదాపు రూ. 2లక్షలు ఖర్చు చేసినని చెప్పాడు. ఇందుకోసం తన భార్య నగలు అమ్మాడు. ఈ కారు ఇంత తొందరలో ఫేమస్ కావడం, ఇంటర్నెట్ లో సంచలనం సృష్టించడం చాలా ఆనందంగా ఉందన్నాడు నవాబ్.