నందిపేటలో ఇనుప స్టాండ్లు తీయడానికి వెళ్లి నీట మునిగి వ్యక్తి మృతి

నందిపేట, వెలుగు: నిమజ్జనం చేసిన గణపతుల కింద ఉండే ఇనుప స్టాండ్లను తీయడానికి వెళ్లి మండల కేంద్రానికి చెందిన షేక్​హుస్సేన్​(57) అనే వ్యక్తి నీట మునిగి చనిపోయాడు. ఎస్ఐ రాహుల్​తెలిపిన ప్రకారం ఆదివారం ఇంటి నుంచి బయలు దేరిన హుస్సేన్​ మండల కేంద్రంలోని ఊర చెరువులో విగ్రహాల కింద ఉండే ఇనుప రాడ్లను తీసుకునేందుకు చెరువులో దిగాడు. రాడ్లు తీసే క్రమంలో కాలు ఇరుక్కుపోవడంతో ఊపిరాడక నీట మునిగి చనిపోయాడు.

సోమవారం ఉదయం శవం నీటిపై తేలింది. మృతుడి భార్య ఖాదర్​బీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, శవాన్ని పోస్టుమార్టానికి తరలించినట్లు ఎస్ఐ తెలిపారు.