పాల్వంచ, వెలుగు: టీబీ ఎంతో కాలంగా పీడిస్తున్న టీబీ తగ్గడం లేదని ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఏఎస్సై సుధాకర్ కథనం ప్రకారం.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ రూరల్ మండలం మల్లారం గ్రామానికి చెందిన ఈసం ప్రభాకర్ (46) మూడేండ్లుగా టీబీతో బాధపడుతున్నాడు. ఎన్ని దవాఖానలకు వెళ్లినా.. ఎన్ని మందులు వాడినా తగ్గడం లేదని బంధువులకు చెప్పుకుని బాధపడేవాడు.
ఈ క్రమంలో శుక్రవారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరు లేని టైంలో గడ్డి మందు తాగాడు. పక్కింటి వారు గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. వారు వెంటనే పాల్వంచ దవాఖానకు తీసుకెళ్లారు. అక్కడి డాక్టర్లు కొత్తగూడెం పంపించడంతో చికిత్స పొందుతూ చనిపోయాడు. మృతుడి సోదరుడు రవీందర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఏఎస్సై తెలిపారు.