నవీపేట్, వెలుగు: మందు పోయలేదని నిజామాబాద్ జిల్లా నవీపేట్లో ఓ వ్యక్తిని తండ్రీకొడుకులు కొట్టి చంపారు. నార్త్ రూరల్ సీఐ సతీష్ కుమార్ కథనం ప్రకారం..నవీపేట్ దర్యాపూర్ కాలనీకి చెందిన కొక్కుల సాయిరాం(42) ఆదివారం చేపల మార్కెట్ షెడ్లో మందు తాగుతున్నాడు. అదే టైంలో లింగమయ్య గుట్టకు చెందిన దైరంగుల నాగరాజు అక్కడికి వచ్చాడు. నాగరాజుకు సాయిరాంతో ఇంతకుముందే పరిచయం ఉంది. తనకు కూడా మందు పోయాలని నాగరాజు సాయిరాంను అడిగాడు. సాయిరాం అందుకు నిరాకరించాడు.
ఈ విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది.అప్పుడే అక్కడికి నాగరాజు కొడుకు గణేశ్వచ్చాడు. ఇద్దరూ కలిసి సాయిరాంను కొట్టారు. గాయపడిన సాయిరాంను గణేశ్ ఆర్ఎంపీ దగ్గరకు తీసుకువెళ్లి ట్రీట్మెంట్ఇప్పించి ఇంట్లో దిగబెట్టాడు. సోమవారం ఉదయం సాయిరాంను అతడి కుటుంబ సభ్యులు లేపగా లేవలేదు. పరిశీలించగా చనిపోయాడు. మృతుడి భార్య ఇందిరా ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహిస్తున్నారు. నిజామాబాద్ ఏసీపీ కిరణ్ కుమార్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు.