పెనుబల్లి, వెలుగు : బైక్ కొనివ్వలేదని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలో బుధవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పెనుబల్లి మండలం ఎరుగట్ల గ్రామానికి చెందిన సాగబోయిన ఆనంద్ (17) తండ్రి చనిపోవడంతో ఎన్కూర్ మండలం తిమ్మారావుపేటలోని మేనమామ వద్ద ఉంటూ ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. ఈ నెల 4న ఎరుగట్లకు వచ్చిన ఆనంద్ తన తాత, నానమ్మను కలిసి బైక్ కొనివ్వాలని అడిగాడు.
సంక్రాంతి తర్వాత కొనిస్తానని చెప్పినా వినలేదు. ఈ నెల 5న అతడి తాత, నానమ్మ పొలం వద్దకు వెళ్లిన తర్వాత ఆనంద్ పురుగుల మందు తాగాడు. అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో గమనించిన స్థానికులు కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి ఆనంద్‌ను పెనుబల్లిలోని ఏరియా హాస్పిటల్‌కు తరలించగా, మెరుగైన ట్రీట్‌మెంట్ కోసం ఖమ్మం తరలించారు. అక్కడ ట్రీట్‌మెంట్ తీసుకుంటూ బుధవారం చనిపోయాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు వీఎం బంజరు పోలీసులు తెలిపారు.