భద్రాద్రికొత్తగూడెం జిల్లా ఇల్లందులో దారుణం: లోన్​ యాప్​ వేధింపులతో యువకుడు ఆత్మహత్య

ఇల్లందు, వెలుగు: ఆన్​లైన్​ లోన్ యాప్  నిర్వాహకుల వేధింపులు తట్టుకోలేక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణానికి చెందిన లోధ్​ సంతోష్(21) గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇల్లందు నాలుగో వార్డ్​కు  చెందిన సంతోష్  ఆన్​లైన్​లో ఓ యాప్  ద్వారా రూ.లక్ష వరకు లోన్  తీసుకున్నాడు. అందులో కొంత తిరిగి చెల్లించాడు. ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోవడంతో మిగిలిన కిస్తీలు కట్టలేక పోయాడు.

దీంతో యాప్​ నిర్వాహకులు ఫోన్లు చేస్తూ వేధించడంతో పాటు కుటుంబసభ్యుల ఫొటోలను మార్ఫింగ్  చేసి అందరికి పంపుతామని బెదిరించడంతో శుక్రవారం రాత్రి గడ్డి మందు తాగాడు. అంతకుముందు ఫ్రెండ్స్ కు చనిపోతున్నట్లు మెసేజ్  పెట్టాడు. కుటుంబసభ్యులు ఖమ్మం ఆసుపత్రికి తీసుకెళ్లగా, చికిత్స పొందుతూ శనివారం చనిపోయాడు.