ఆన్ లైన్ లోన్ యాప్స్ నిర్వాహకుల ఆగడాలు ఆగడం లేదు. వాళ్ళ అరాచకానికి బాధితులు ప్రాణాలు కోల్పోతున్నారు. అవసరానికి డబ్బు తీసుకుని వడ్డీతో సహా తిరిగి చెల్లించినా.. లోన్ యాప్ ల నిర్వాహకులు మాత్రం వడ్డీలకు వడ్డీలు వేస్తూ వేధిస్తున్నారు. రీసెంట్ గా లోన్ యాప్ ఆగడాలకు మరో యువకుడు బలయ్యాడు. కరీంనగర్ లోని సాయినగర్ కు చెందిన శ్రవణ్ అనే వ్యక్తి లోన్ యాప్ లో మూడు లక్షలు అప్పు తీసుకున్నాడు.
అందులో కొంత స్నేహితులకు అప్పు ఇచ్చాడు. అయితే శ్రవణ్ కు తన స్నేహితులు టైంకి డబ్బులు ఇవ్వలేదు. దీంతో ఇటు అప్పు తీర్చాలని లోన్ యాప్ నిర్వాహకుల వేధించడటంతో శ్రవణ్ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఈ నెల 23న పురుగుల మందు తాగిన శ్రవణ్..నిన్న చికిత్స పొందుతూ చనిపోయినట్లు చెప్పారు. యాప్ నిర్వహకులపై చర్యలు తీసుకువాలని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశామని కుటుంబ సభ్యులు తెలిపారు.