ఎక్స్‌‌పైర్‌‌ అయిన ట్యాబ్లెట్లు ఇవ్వడంతో అస్వస్థత

ఎక్స్‌‌పైర్‌‌ అయిన ట్యాబ్లెట్లు ఇవ్వడంతో అస్వస్థత
  • వరంగల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిల్లా వర్ధన్నపేట హాస్పిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఘటన

వర్ధన్నపేట, వెలుగు : గడువు ముగిసిన మందులు ఇవ్వడంతో ఓ వ్యక్తి అస్వస్థతకు గురయ్యాడు. ఈ ఘటన వరంగల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిల్లా వర్ధన్నపేట ఏరియా హాస్పిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సోమవారం జరిగింది. వరంగల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిల్లా రాయపర్తికి చెందిన బండారి అశోక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు జ్వరం రావడంతో వర్ధన్నపేట ఏరియా హాస్పిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వచ్చాడు. పరీక్షించిన డాక్టర్లు జ్వరం తగ్గడానికి మందులు రాశారు. హాస్పిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని ఫార్మసీలో ట్యాబ్లెట్లు తీసుకొని వేసుకున్న అనంతరం తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు.

 వెంటనే డాక్టర్లు ట్రీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారు. అయితే అస్వస్థతకు గురి కావడానికి గల కారణాలను తెలుసుకునే ప్రయత్నం చేయగా ఫార్మసీ నిర్వాహకులు ఎక్స్‌‌పైర్‌‌ అయిన ట్యాబ్లెట్లు ఇచ్చినట్లు తేలింది. ఈ విషయంపై హాస్పిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సూపరింటెండెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను సంప్రదించగా ముందుగా అలాంటిదేమీ లేదని దబాయించే ప్రయత్నం చేశారు. ట్యాబ్లెట్లకు సంబంధించిన వివరాలు చెప్పడంతో ఘటనపై విచారణ చేస్తామని చెప్పారు.