లీజు తీసుకున్న స్థలంలో కోటి రూపాయల వజ్రం

లీజు తీసుకున్న స్థలంలో కోటి రూపాయల వజ్రం

ఇటుకబట్టీలో పనిచేసే వ్యక్తికి దశ తిరిగింది. ఎన్నో ఏండ్లుగా పనిచేస్తున్న ఆయనను అదృష్టం వరించింది. బట్టీలో పనిచేస్తుండగా.. కోట్ల విలువైన డైమండ్ దొరికింది. ఈ ఘటన మధ్యప్రదేశ్‎లో వెలుగుచూసింది. పన్నా జిల్లాలోని కిషోర్‌గంజ్ నివాసి సుశీల్ శుక్లా కొన్నేండ్లుగా కృష్ణ కళ్యాణ్‌పూర్ ప్రాంతంలో ఒక స్థలాన్ని లీజుకు తీసుకొని ఇటుకబట్టీ వ్యాపారంతో పాటు వజ్రాల వ్యాపారం చేస్తున్నాడు. గనిలో ఇటుకల కోసం మట్టిని తవ్వుతూ వజ్రాలను వెతుకుతూ ఉండేవారు. సోమవారం కూడా తన వారితో కలిసి మట్టిని తవ్వుతుండగా ఒక విలువైన వజ్రం లభించింది. వెంటనే శుక్లా.. ఆ వజ్రాన్ని డైమండ్ ఆఫీసర్ రవి పటేల్‎కు చూపించారు. దాన్ని పరిశీలించిన ఆ అధికారి.. వజ్రం విలువ రూ.1.20 కోట్లు ఉంటుందని, అది స్వచ్ఛమైన 26.11 క్యారెట్ల వజ్రమని తెలిపాడు. ఈ వజ్రాన్ని రెండు రోజుల్లో వేలానికి పెడతామని.. ప్రభుత్వ రాయల్టీ, పన్నులు మినహాయించి వచ్చిన మొత్తాన్ని శుక్లాకు అందజేస్తామని ఆయన తెలిపారు.

ఈ ఘటనపై శుక్లా మాట్లాడుతూ.. తాను మరియు తన కుటుంబం గత 20 ఏండ్లుగా డైమండ్ మైనింగ్ పనిలో ఉన్నామని తెలిపాడు. అయితే ఇంత పెద్ద వజ్రం లభించడం ఇదే తొలిసారి అని శుక్లా చెప్పాడు. వజ్రం దొరికిన గనిని తనతో సహా మరో నలుగురు భాగస్వాములతో కలిసి లీజుకు తీసుకున్నట్లు తెలిపాడు. ‘వజ్రం వేలం తర్వాత వచ్చిన డబ్బుతో నేను వ్యాపారం ప్రారంభించాలనుకుంటున్నాను’ అని చెప్పాడు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌కు 380 కి.మీ దూరంలో ఉన్న పన్నా జిల్లాలో 12 లక్షల క్యారెట్ల విలువైన వజ్రాల నిల్వలు ఉన్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు.

For More News..

సినీ ఇండస్ట్రీలో మరో మరణం

స్థానికులనే శరణార్థులుగా మార్చారు