సమోసాలో బ్లేడు..చంపేయండ్రా చంపేయండి ఇలా కూడా..

సరదాగా సమోసా తిందామని పోతే చంపేసేలా ఉన్నారు వీళ్లు.హోటళ్లు, రెస్టారెంట్, వీధుల్లో ఆహార పదార్థాలు అమ్మేవారు.. కస్టమర్ల ఆరోగ్యం సంగతి పక్కనబెట్టి.. వ్యాపార లాభాలు చూసుకుంటున్నారు..తినే ఫుడ్ లో ఏకంగా బొద్దింపులు , ఎలుకలు, పురుగుతులు, ఇనుప ముక్కలు, బ్లేడ్లు వస్తు్న్నా పట్టించుకోవడం లేదు. 

ఓ రెస్టారెంట్ బిర్యానీలో బొద్దింకలు, ఇనుప ముక్కలు..బేకరీలో అమ్ముతున్న కూల్ డ్రింక్స్ లో గుట్కా ప్యాకెట్లు..ఇలాంటి న్యూసే సోషల్ మీడియాలో, టీవీలు, పత్రికల్లో తరుచుగా చూస్తున్నాం. వీధుల్లో దొరికే ఆహార పదార్థాల్లో ఏదో హానికలిగించే వస్తువుల ప్రత్యక్ష మవడం ఆందోళన కలిగిస్తోంది. ఎప్పుడు ఇంట్లో ఫుడ్డేనా.. ఓసారి బజారుకు పోయి ఏదో తిందామని పోతే ఏకంగా ప్రాణాల  మీదకే వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది.  తాజాగా రాజస్థాన్ లోని టోంక్ అనే ప్రాంతంలో సమోసాలో ఏకంగా బ్లేడ్ రావడంతో కస్టమర్ బెంబేలెత్తిపోయాడు. వేడి వేడి సమోసా తిందామని వచ్చిన అతను బ్లేడ్ చూసి షాక్ తిన్నాడు. 

ALSO READ | బంగ్లా డిప్యూటీ హైకమిషనర్ కు భారత్ నోటీసులు

టోంక్ ప్రాంతంలో నివాసముండే హోంగార్డు గా పనిచేస్తున్న వర్మ అనే వ్యక్తి ఏదైనా తిందామని రోడ్ సైడ్ స్నాక్స్ స్టాల్స్ కు వెళ్లాడు. సమోసా తింటుండగా.. పదునైన షేవింగ్ బ్లేడ్ నోట్లోకి రావడంతో షాక్ తిన్నాడు. ఈ విషయంపై స్నాక్స్ స్టాల్ ఓనర్ ను ప్రశ్నించగా చాలా లైట్ గా తీసుకొని నిర్లక్ష్యంగా మాట్లాడాడు.దీంతో హోంగార్డు తనకు ఎదురైన అనుభవాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అంతేకాదు.. పోలీసులకు, ఫుడ్ సేఫ్టీ డిపార్టుమెంట్ కు ఫిర్యాదు చేశాడు. 

దీనిపై స్పందించిన నెటిజన్లు.. ఫుడ్ సేఫ్టీఅ ధికారులు విస్తృత తనిఖీలు చేపట్టాలి. ఇలాంటి ఫుడ్ సప్లయ్ చేస్తున్నవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచిస్తు్న్నారు.