అమూల్ బటర్ మిల్క్ ప్యాకెట్లలో పురుగులు..కస్టమర్ షాక్

అమూల్ బటర్ మిల్క్ ప్యాకెట్లలో పురుగులు..కస్టమర్ షాక్

ఈ ఆన్ లైన్ ఆర్డర్ అంటేనే కస్టమర్లు జంకుతున్నారు. ఏదీ బుక్ చేస్తే ఏది వస్తుందో తెలియని పరిస్థితి. ఓ వస్తువుల ఇంకో వస్తువు పంపించడం.. లేదా ఇటుకలు, రాళ్లు పంపించడం వంటి సంఘట నలు గతంలో చాలా జరిగాయి. ఇటీవల కాలంలో నాణ్యతలేని, పాడయిపోయిన డైలీ యూజ్ ప్రాడక్ట్స్ పంపించడం వంటి ఘటనలు మనం చాలాచూస్తున్నాం. తాజాగా ఓ వ్యక్తి ఆన్ లైన్ అమూల్ బటర్ మిల్క్ బుక్ చేయగా.. అతని వచ్చిన పార్శిల్ విప్పి చూసి షాక్ తిన్నాడు. పాడైపోయిన బటర్ మిల్క్ ప్యాకెట్లు, వాటిలో పరుగులు దర్శనమిచ్చాయి. దీంతో వాటిని వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. 

X ఖాతాదారు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడిలో అమూల్ బటర్ మిల్క్ ఉంచి డబ్బాలో అన్నీ పురుగులే కనిపిస్తున్నాయి. పైగా బటర్ మిల్క్ పాడైపోయి ఉంది. ఈ వీడియో ,ఫొటోలతోపాటు ‘‘హే అమూల్ మీరు అధిక ప్రోటీన్ మజ్జిగతో పాటు మాకు WORMS  కూడా పంపారు అని ఎటకారంగా రాశారు. 

నేను ఇటీవల కొనుగోలు చేసిన మజ్జిగలో పురుగులు కనిపించడంతో నా తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసేందుకు ఈ వీడియోను షేర్ చేస్తున్నాను.. నాకు ఎదురైన ఎక్స్ పీరియన్స్ నమ్మశక్యం కావడంలేదు.. అని కస్టమర్ రాశాడు. 

ఈ వీడియో షేర్ చేసిన కొద్ది గంటల్లోనే నాలుగున్నర లక్షల వ్యూస్ వచ్చాయి. చాలా మంది ఇలాంటి అనుభవాలు వారికి కూడా ఎదురయ్యాయని చెప్పుకొచ్చారు. నాణ్యత లేని, కుళ్లిపోయిన ప్రాడక్టులను సరఫరా చేస్తున్నా అమూల్ లాంటి సంస్థల ఉత్పత్తులను ఎవరూ కొనొద్దని చెపుతున్నారు. ఇలాంటి మళ్లీ మళ్లీ జరగకుండా ఫుడ్ సేఫ్టీ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. 

Also Read :- పెరిగిన బంగారం, వెండి ధరలు

ఈ విషయం అమూల్ కంపెనీ దృష్టికి వెళ్లింది. వెంటనే తప్పును సరిదిద్దుకున్న కంపెనీ యాజమాన్యం ఆ కస్టమర్ సారీ చెప్పింది. ఇలాంటివి మరోసారి జరగకుండా చూసుకుంటామని చెప్పింది.