నల్లా నీళ్లతో బైక్ వాష్​ .. వెయ్యి రూపాయలు ఫైన్

నల్లా నీళ్లతో బైక్ వాష్​ .. వెయ్యి రూపాయలు ఫైన్

హైదరాబాద్ సిటీ, వెలుగు: వాటర్​బోర్డు సప్లయ్​చేస్తున్న నీటితో బైక్​వాష్​చేస్తున్న యువకుడికి రూ.1000 ఫైన్​పడింది. వాటర్ బోర్డు ఎండీ అశోక్ రెడ్డి బుధవారం పంజాగుట్ట నుంచి జూబ్లీహిల్స్ వైపు వెళ్తుండగా రోడ్ నం.78లో వాటర్​పైపల్​లైన్​లీక్​అయినట్లు గమనించారు. 

కారణాలు ఆరా తీయమని ఆదేశించడంతో స్థానిక అధికారులు పరిశీలనకు వెళ్లారు. తీరా ఓ వ్యక్తి ఇంటి ముందు నల్లా నీటితో బైక్ కడుగుతూ కనిపించాడు. ఆ నీరంతా రోడ్డుపై పారుతోంది. ఎండీ అశోక్​రెడ్డి ఆదేశాలతో అధికారులు అతనికి నోటీసులు జారీచేశారు. రూ.1000 జరిమానా విధించారు.